Wednesday, December 4, 2024

Ration Rice Scame – స్టెల్లా నౌక‌లో మ‌రోసారి త‌నిఖీలు..

కాకినాడ: రేషన్ బియ్యం ఎగుమ‌తి కోసం కాకినాడ‌ పోర్టులో లంగ‌ర్ వేసిన స్టెల్లా ఎల్ పనామా నౌకలో ఇవాళ అధికారులు మరోసారి తనిఖీలు చేపట్టారు. ఇందుకోసం పోర్టు, కస్టమ్స్, పౌరసరఫరాలు, పోలీసు, రెవెన్యూ అధికారులతో బృందం సముద్రంలోకి వెళ్లారు. ఈ మల్టీ డిసిప్లీనరీ కమిటీ బృందం రేషన్ బియ్య నమూనాలు సేకరించారు. వాటిని ల్యాబ్ కు పంపి అందులో ఉన్న‌వి రేష‌న్ బియ్య‌మా కాదా అనేది నిగ్గు తేల్చ‌నున్నారు.

ఇదిలా ఉంటే నౌకలో 640 టన్నుల పేదల బియ్యం ఉన్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ గత నెల 27న ప్రకటించారు. 29న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టులు సందర్శించి ఇక్కడి భద్రత వైఫల్యాలు, కీలక శాఖల పర్యవేక్షణ లోపాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడికక్కడే ‘సీజ్ ద షిప్’ అని ఆదేశించారు. దీంతో అందరి దృష్టి కాకినాడ పోర్టుల వైపు మళ్లింది. కాకినాడ కేంద్రంగా గత అయిదేళ్లు రెచ్చిపోయిన రేషన్ మాఫియా రెక్కలు విరిచేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. వివాదాస్పద నౌక నుంచే ప్రక్షాళనకు నిర్ణయించింది. ఈనేపథ్యంలో అయిదు విభాగాల‌తో కూడిన ఏర్పాటు చేసిన బృందం బుధవారం నౌకను పరిశీలించింది. ఈ బియ్యం ఎవ‌రి ద్వారా ఎగుమ‌తి అవుతున్నాయో వివ‌రాల‌ను సైతం పోర్టు అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement