Wednesday, November 6, 2024

తహ‌శీల్దార్ కు రేషన్ పంపిణీ వాహనదారుల సమస్యల చిట్టా..

గిద్దలూరు:మార్చి25(ప్రభ న్యూస్) గిద్దలూరు మండలం రేషన్ పంపిణీ వాహనదారులు మండల డిప్యూటీ తాసిల్దార్ బివి ఎం ఎస్ ప్రసాద్ ను శనివారం కలిసి తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ విన‌తి ప‌త్రం అంద‌జేశారు.. ఎం డి యు వాహనాలకు సంబంధించిన ఇన్సూరెన్స్ అమౌంట్ ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పినప్పటికీ బ్యాంక్ ఆఫ్ బరోడా వారు తమ ఇష్ట అనుసారంగా ప్రతి ఒక్క ఎండియు ఆపరేటర్ కి సుమారు 18 వేల రూపాయల నుండి 23,000 వరకు మైనస్ లో పెట్టి జీతం పడిన వెంటనే ఆ అమౌంట్ను కట్ చేయడం జరిగిందని తెలిపారు. తక్షణమే మా అమౌంట్ త‌మ‌కు ఇప్పించవలసిందిగా కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎండియూ ఆపరేటర్స్ విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతోనూ, ఇత‌ర అనారోగ్యంతో సుమారు 57 మంది చనిపోవడం జరిగిందిని తెలిపారు. వారికి తక్షణమే ప్రభుత్వం బీమా సదుపాయం కల్పించి వారి కుటుంబ సభ్యులకు ఆదుకోవాలని విజ్ఞ‌ప్తి చేశారు.. అలాగే ఎండియు ఆపరేటర్స్ అందరికీ ప్రమాద బీమా కల్పించాలని విన్నవించారు. గత రెండు సంవత్సరాల కాలంగా పెండింగ్లో ఉన్న జీతాలను తక్షణం విడుదల చేసే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయవలసిందిగా విన‌తిప‌త్రంలో కోరారు. ఐసిడిఎస్ ఎం.డి.యం గత 5 నెలలుగా పంపిణీ చేసిన శాలరీ ఇంతవరకు పడలేద‌ని, వీలైనంత త్వరగా ప్రభుత్వం నుంచి వచ్చే లాగా సహకరించాల‌ని అప‌రేట‌ర్లు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement