శ్రీకాకుళం, ప్రభన్యూస్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవిల్లిలో రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు ఆలయానికి గురువారం అర్ధరాత్రి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పోటేత్తారు రాత్రి 12:30 కి ఆలయంలో స్వామివారి నిజరూప దర్శనం, క్షీరాభిషేకం కార్యక్రమాలు ప్రారంచారు.
విశాఖపట్నం కు చెందిన శారదాపీఠం కు చెందిన స్వాత్మానంద స్వామి తన శిష్య బృందంతో ఆలయానికి విచ్చేసి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పట్టు వస్త్రాలు అందజేశారు.
రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు శాసనసభ్యులు, గొర్లె కిరణ్ కుమార్, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, జిల్లా ఎస్పీ జి ఆర్ రాధిక దంపతులు, ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్,ఎమ్మెల్యే కళావతి, జిల్లా జడ్జి, తెలంగాణకు చెందిన శాసనసభ్యులు మలిరెడ్డి రంగారెడ్డి, ఆర్డిఓ రంగయ్య, ఇతర ప్రజాప్రతినిధులు ఉదయం నాలుగు గంటలకే ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.