Friday, November 22, 2024

Tirumala : నేడు తిరుమ‌ల‌లో ర‌థ‌స‌ప్త‌మి వేడుకలు… ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు ర‌ద్దు

తిరుమలలో తిరుమల తిరుపతి దేవవస్థానం ఇవాళ‌ రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఒకేరోజు ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ సమయంలో భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేప‌థ్యంలో టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది.

రథసప్తమి వేడుకల సందర్భంగా ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీవారికి వివిధ వాహన సేవలు నిర్వహించనున్నారు మొత్తం 7 వాహనాలపై భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి. తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహన సేవ, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు.

- Advertisement -

ఇక, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. ఇవాళ, రేపు తిరుపతిలో జారీ చేసే సర్వదర్శన టోకెన్లు రద్దు చేసింది టీటీడీ.. రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నారు టీటీడీ అధికారులు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement