అభివృద్ధి మాది… అంటే మాది అంటూ ఇరుపక్షాల వాదనలు
భారీ పోలీసు బందోబస్తు.. సర్ది చెపుతున్న ఛైర్మన్
ఎమ్మిగనూరు టౌన్ (కర్నూలు జిల్లా) : ఎమ్మిగనూరు పట్టణ అభివృద్ధిపై మాది అంటే మాది అని వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వివాదం తో సమావేశం గందరగోళంగా మారింది. ఇరుపక్షాల వాదనలు మిన్నంటడంతో సమావేశం అర్దాంతరంగా ముగించారు. మంగళవారం మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ కెయస్ రఘు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముందుగా వైస్ ఛైర్మన్ నజీర్ ఆహ్మద్ అజెండా అంశాలు అన్ని ఆమోదిస్తున్నట్లు తెలపడంతో సభ్యులందరూ ఆమోదం తెలిపారు. పరస్పరం క్రిస్మస్, నూతన సంవత్సర, శ్రీ నీలకంఠేశ్వర రథోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ సందర్భంగా టీడీపీ ఫ్లోర్ లీడర్, 21 వార్డు కౌన్సిలర్ దయాసాగర్ మాట్లాడుతూ… పట్టణంలో సెంటర్ లైటింగ్ సిస్టం, ఎంబి చర్చి దగ్గర సిసి రోడ్డుకు నిధులు కేటాయించి వేయించిన ఘనత ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డికి దక్కిందని, గతంలో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సగం నిధులు తక్కిన నిధులు ప్రస్తుత ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి కేటాయించారని, శాశ్వత తాగునీటి పథకం ఏఐఐబి నిధులకు సంబంధించి రూ.141 కోట్లు జివో 2018 లో బీవీ తెచ్చారని అనడంతో వైస్ ఛైర్మన్ నజీర్ ఆహ్మద్ మాట్లాడుతూ.. గతంలో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సెయింట్ లైటింగ్ కు అప్పటిలోనే నిధులు కేటాయించారనీ సగం పనులు చేయడం మాజీ ఎమ్మెల్యేకు అలవాటు లేదన్నారు. ఇక సెంటర్ లైటింగ్ కు తదితర అభివృద్ధికి ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ఏ నిధులు తెచ్చారో తెలపాలని ప్రశ్నించారు.
దీంతో సమావేశంలో గందరగోళం ఏర్పడింది. ఇరువురు వాగ్వివాదానికి దిగారు. స్పష్టత ఇవ్వాలని కమీషనర్ ను కోరారు. అయినా కౌన్సిల్ లో బలం వైసీపీదేనని, మేము అభివృద్ధికి సహకరిస్తూ ఉన్నామని, అలాంటప్పుడు ఎమ్మెల్యే నిధులు ఎక్కడి నుండి తెచ్చారని వైస్ ఛైర్మన్ అన్నారు. ఆ సమయంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ అధికారం కోల్పోయిన తరువాత, అధికారంలో ఉన్న పార్టీ అభివృద్ధి చేసినట్లు అనడంతో కౌన్సిల్ పూర్తి కోరం మాదేననీ పట్టణ అభివృద్ధి మాదే అన్నారు.
ఇరువురికి సర్ది చెప్పే ప్రయత్నం చేసిన ఛైర్మన్ సమావేశం ముగించారు. ముందస్తుగా కౌన్సిల్ సమావేశానికి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కమిషనర్ గంగిరెడ్డి, మేనేజరు వరప్రసాద్, డీఈఈ నీరజ, రాజు నాయక్, విక్టర్ పాల్, ఏఈ శరత్ చంద్ర, మదన్ శానిటరీ ఇన్స్ స్పెక్టర్ శీనివాసులు, సత్యన్న, ఆర్వో అస్లాం, తదితరులు పాల్గొన్నారు.