విశాఖపట్నం జిల్లా సముద్ర తీరంలో అరుదైన చేప చిక్కింది. అచ్యుతాపురం మండలం పూడిమడక తీరంలో మత్స్యకారుల వలలో పడింది. స్థానికంగా సానిపాపగా పిలిచే ఈ చేప సముద్రంలో లోతైన ప్రాంతంలో ఉంటుంది. తీరానికి సమీపంలో ఉండే రాళ్లలో కూడా అరుదుగా సంచరిస్తుంది. రకరకాల రంగుల్లో అందంగా కనిపించడంతో మత్స్యకారులు సానిపాపగా పిలుస్తారు. ఈ అరుదైన చేప 2 కేజీల వరకు పెరుగుతుంది.. రాళ్ల మధ్య తిరుగుతుందని చెబుతున్నారు. అరుదుగా లభించే ఈ చేప రుచిగా ఉంటుంది అంటున్నారు. అరుదుగా కనిపించే ఈ చేపను చూడటానికి స్థానికులు ఆసక్తి చూపించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement