Friday, November 22, 2024

Rare Fish – జాలర్లకు జాక్ పాట్ ‍ – రూ.3.30 లక్షలు పలికిన ‘కచిడి’ చేప..

కాకినాడ జాలర్లు జాక్ పాట్ కొట్టారు..తమ వలలో చిక్కిన కచిడి చేప వారికి లక్షలు కురిపించింది.. వివరాలలోకి వెళితే ,..
మత్స్యకారులకు చిక్కిన అరుదైన చేప.. వేలంలో కళ్లు చెదిరే ధర పలికింది. అనేక వ్యాధులను నయం చేసేందుకు తయారుచేసే ఔషధాల్లో ఉపయోగించే ‘కచిడి’ చేప.. కాకినాడ కుంభాభిషేకం రేవులో మత్స్యకారులు వలకి కచిడి చేప చిక్కింది.వెంటనే ఈ చేపను వేలం వేయగా దాదాపు రూ.3.30 లక్షలు పలికింది. ఈ కచిడి చేప బరువు 25 కిలోల దాకా ఉంది. ఇక వేలం వేయడంలో మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి రూ.20 వేలు కమిషన్ తీసుకున్నాడు. దీంతో మత్స్యకారుల చేతికి రూ.3.10 లక్షలు వచ్చినట్లు సమాచారం.

కాగా, కచిడి చేప పొట్టలోని తిత్తులు ఔషధాల తయారీకి ఉపయోగపడతాయి. సర్జరీ చేశాక కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్‌‌తో తయారు చేస్తారని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. పిత్తాశయం, ఊపిరితిత్తుల మందుల తయారీలో ఎక్కువగా ఈ చేపను ఎక్కువగా ఉపయోగిస్తుంటారని పేర్కొంటున్నారు. అందుకే ఈ చేప రూ.లక్షలలో ధర పలికిందని జాలర్లు సంబర పడుతున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement