Saturday, November 23, 2024

AP | ప్రపంచ స్థాయి సౌకర్యాలు… శ‌రవేగంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి !

(ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : రైలు ప్రయాణికుల సౌకర్యం సౌలభ్యం తో పాటు పెరుగుతున్న రద్దీ, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ స్టేషన్లను శరవేగంగా అభివృద్ధి చేస్తుంది. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించడంలో భాగంగా, అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే దిశగా రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి చర్యలు జరుగుతున్నాయి.

రైల్వేస్టేషన్లో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇతోతిక సహాయం చేస్తున్న నేపథ్యంలో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రాష్ట్రంలోని 53 రైల్వేస్టేషన్లో ఆధునికరణ జరుగుతోంది. మొత్తం రేపు 1400 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న ఈ పనులు వేగవంతమైన పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ప్రయాణికులు మరింత సౌకర్యంగా రైలు ప్రయాణాన్ని ఆస్వాదించనున్నారు.

దక్షిణ మధ్య రైల్వే ద్వారా సేవలందిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 53 రైల్వే స్టేషన్‌లు ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలను అందించడానికి, ప్రాంతీయ ప్రజలకు వృద్ధి కేంద్రాలుగా మార్చడానికి పునరాభివృద్ధి చేయబడుతున్నాయి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గత ఏడాది ఆగస్టు, ఈ ఏడాది ఫిబ్రవరి లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేయడంతో ఈ పధకానికి మరింత ప్రోత్సాహం లభించింది.

తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్ల ప్రధానమైన పునరాభివృద్ది పనులు చేపట్టబడి శర వేగంగా జరుగుతున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే స్టేషన్‌లను ఆధునీకరించడం, దీర్ఘకాలిక దృష్టితో నిరంతర ప్రాతిపదికన అభివృద్ధిని ఊహించడం లక్ష్యంగా పెట్టుకుని అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ విధానాన్ని రూపొందించింది.

ఎప్పటికప్పుడు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా,రైల్వే స్టేషన్‌ల ప్రోత్సాహాన్ని పెంచే మాస్టర్ ప్లాన్ ప్రకారం వివిధ కీలక అంశాల అమలుపై ఆధారపడింది. ఈ పథకం కింద రైలు ప్రయాణికులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాట్లను పూర్తిస్థాయిలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయనున్నారు.

- Advertisement -

రైల్వే ప్రయాణికులకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని అందించే విధంగా ఈ స్టేషన్ల అభివృద్ధి ప్రస్తుతం వివిధ దశల్లో వేగంగా జరుగుతోంది. రేణిగుంట, గూడూరు రైల్వే స్టేషన్ల మరింత అభివృద్ధి ప్రతిపాదనలు మంజూరులో ఉన్నాయి. విజయవాడ రైల్వే స్టేషన్‌కు సంబంధించి టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ ఫైనల్ ప్రక్రియలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement