.ముస్లింలు అత్యంత పవిత్ర మాసంగా భావించే రంజాన్ మాసం మంగళవారం నుంచి ప్రారంభమవుతోంది. నేడు భారత్ లో నెలవంక కనిపించడంతో మంగళవారం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు మంగళవారం నుంచి చేపట్టవచ్చని ముస్లిం మత పెద్దలు ప్రకటించారు.
లక్నో,ఆగ్రా, కోల్ కతాలో నెలపొడుపు సాయంత్రం 6.52 నిమిషాలకు కనిపించడంతో పవిత్ర రంజాన్ మాసం మంగళవారం నుంచి మొదలవుతుంది.
నెల పాటు కఠోర ఉపవాస దీక్షలు..
ముస్లింలు అత్యంత భక్తి, శ్రద్దలతో, నియమ, నిష్టలతో ఈ నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపడతారు. సూర్యోదయం నుంచి సూర్యస్తమయం వరకు కనీసం మంచినీళ్లు కాదు కదా కనీసం నోటిలోని లాలా జలాన్ని కూడా మింగకుండా భగవంతుడ్ని ప్రార్ధిస్తారు. రోజులో సూర్యోదయానికి ముందు సహర్ నుంచి సూర్యస్తమయం ఇఫ్తార్ వరకు రోజూకు ఐదు సార్లు నమాజ్ చేస్తారు.
ఖురాన్ పఠనం..
ఐదు సార్లు నమాజ్ చేయడంతో పాటు రాత్రి 8.30గంటల నుంచి రాత్రి 10గంటల మధ్య కాలంలో తరావీహ్ నమాజులో ఖురాన్ చదువుతారు. ఈ నెల రోజుల్లో సఫిల్ చదివితే ఫరజ్ చదివినంత పుణ్యమని ఇస్లాం గ్రంధాల్లో ఉంది. ముస్లిం మతపెద్దలు కూడా అదే చెబుతుంటారు.