Tuesday, July 2, 2024

AP | రామోజీరావుది భయమెరుగ‌ని జీవితం.. పోరాటం ఆయనలో ఓ భాగం : సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లోని కానూరులో ప్రభుత్వం నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ.. ఒకే ఒక ఎన్టీఆర్.. ఒకే ఒక రామోజీరావు ఇద్దరూ ఇద్దరే అని…. ఒకే ఒక ఎన్టీఆర్… ఒకే ఒక రామోజీరావు… వీరిని అధిగ‌మించ‌టం ఎవ్వ‌రికీ సాధ్యం కాదు అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌తో పాటు రామోజీరావుకు కూడా భారతరత్న ఇవ్వాలన్నదే అందరి కోరిక అని అన్నారు.

భయమనేది రామోజీరావు జీవితంలో లేదు.. పోరాటం ఆయనలో ఓ భాగం.. రామోజీరావు అక్షర శిఖరం.. సాధారణ కుటుంబంలో పుట్టి అచంచలమైన విశ్వాసంతో ఎదిగారు.. రామోజీరావు వ్యక్తి కాదు వ్యవస్థ.. చేపట్టిన ఏ రంగమైనా ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేశారు అంటూ ఆ అక్షర యోధుడిని స్మరించుకున్నారు.

మార్గదర్శిలో ప్రతీ పెట్టుదారుడు రామోజీరావు వెంటే నిలిచారంటే అదీ ఆయన విశ్వసనీయత అన్నారు చంద్రబాబు.. 40 ఏళ్లుగా నెంబర్1 లో ఈనాడు ఉందంటే ఎంతటి కార్యదీక్ష ఉందో అందరూ అర్ధం చేసుకోవాలన్న ఆయన.. రాజధానికి రామోజీరావు సూచించిన పేరు ప్రపంచ మంతా మార్మోగింది.. తెలుగు భాష అంటే రామోజీరావుకు ఎనలేని అభిమానం, తెలుగు జాతి అంటే ఎనలేని ఆప్యాయత.. రామోజీరావు స్థాపించిన వ్యవస్థ ఆయన కుటుంబ సభ్యులదే కాదు, 10 కోట్ల మంది ప్రజలది అని అన్నారు.

అమరావతి, ఢిల్లీలో రామోజీ సైన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం… అమరావతిలో రోడ్డుకు రామోజీ మార్గ్‌గా పేరు పెడతాం… విశాఖలో రామోజీరావు చిత్రపురి నిర్మిస్తాం అని పేర్కొన్నారు. ఇక, విశాఖలో రామోజీరావు మొదటి అడిషన్ పెట్టారు… ఈనాడు ప్రజాగళంగా ప్రజా చైతన్యం కోసం పనిచేస్తున్నది.. పత్రికా రంగంలో ఉండి రామొజీరావు ప్రజా సమస్యల కోసం పని చేసారు.

సినిమా రంగంలో, జర్నలిజంలో ఎందరినో తయారు చేసారు.. ఒక మెగా స్కేలులో ఆలోచించి జయప్రదం చేసే వ్యక్తి రామోజీరావు.. ఇతర రాష్ట్రాలలో తుఫానులు వచ్చినా ముందుండి సేవలు అందించారు.. ఏ పని చేసినా ప్రజాహితం కోసం పని చేసారు రామోజీరావు.. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తిగా ప్తజలు గుర్తు పెట్టుకుంటారు అని కొనియాడారు..

- Advertisement -

ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా.. ధైర్యంగా ఎదుర్కొన్నారు అని గుర్తుచేశారు చంద్రబాబు. ఏ ఐఏఎస్ ను బదిలీ చేయమని, ఏ పనీ తనకు చేసి పెట్టమని ఏరోజు అడగని వ్యక్తి రామోజీరావు. పదవులు కోసం కాదు ప్రజా చైతన్యం కోసం పని చేసిన వ్యక్తి రామోజీరావు.. అప్పట్లో 9 నెలల్లో రామారావు అధికారంలోకి రావడంలో రామోజీరావు పాత్ర ఉంది.. రాజీ పడకుండా పోరాడి, సుప్రీంకోర్టు వరకూ వెళ్ళి తన పనులు నిజం అని నిరూపించుకున్న వ్యక్తి రామోజీరావు.. నలభై ఏళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసిన వ్యక్తి రామోజీరావు అని గుర్తుచేసుకున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement