ఏపీ మంత్రి పేర్ని నానికి రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై ఆర్జీవీ ప్రశ్నించారు. ప్రశ్నలకు జవాబివ్వాలని రాంగోపాల్ వర్మ మంత్రి నాని ని కోరారు. సినిమా సహా ఉత్పత్తికి ధర నిర్ణయంలో ప్రభుత్వ పాత్ర ఎంత ఉందని అడిగారు. హీరోల రెమ్యునరేషన్ సినిమా ఖర్చు, లాభంపై ఉంటుందన్నారు. ఖర్చు, రాబడిని ఏపీ మంత్రుల బృందం అర్థం చేసుకోవాలన్నారు. పేదలకు సినిమా అవసరమని మీరు భావిస్తే రాయితీ ఇవ్వాలన్నారు. వైద్య, విద్యా సేవలకు ప్రభుత్వం రాయితీలిస్తోందని, అదేవిధంగా సినిమాలకు కూడా ఎందుకు సబ్సిడీ ఇవ్వరని ప్రశ్నించారు. పేదలకు బియ్యం, పంచదార అందించేందుకు రేషన్ షాపులు సృష్టించబడ్డాయని, మీరు రేషన్ థియేటర్లను సృష్టించడంపై ఆలోచిస్తారా అని రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో ప్రశ్నించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital