హైదరాబాద్, : ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ పండగ సౌదీలో గురువారం జరుపుకుంటున్నారు. శుక్రవారం తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా జరుపుకోనున్నారు. సౌదీలో బుధవారం ఆకాశంలో నెల వంక కనిపించింది. దీంతో అక్కడ రంజాన్ పండగకు పట్టణాలన్నీ ముస్తాబయ్యాయి. సౌదీలో జరుపుకున్న ఒక రోజు అనంతరం భారత్‌లో రంజాన్‌ను జరుపుకుంటారు. రంజాన్ పండుగ ఏ రోజు అనే విషయంపై స్పష్టత రావడంతో ముస్లింలు పండుగకు సిద్దమవుతున్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నెల రోజులుగా ఉపవాస దీక్ష (రోజా) ఉన్నారు. రంజాన్ ప్రత్యేక ప్రార్థనల కోసం ఈ సారి కరోనా కారణంగా ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ప్రత్యేక ప్రార్థనలను ఎవరి ఇళ్ళల్లో వారే నిర్వహించుకోవాలని పోలీసులు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు జరిగే ప్రార్థనా మందిరాల వద్ద పోలీసులు ముందస్తు బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇళ్ళల్లోనే ప్రార్థనలు : ఎంపీ ఓవైసీ
ఈ నెల 14 వ తేదీన రంజాన్ పర్వదినం సందర్భంగా జరుపుకునే ఈదుల్ ఫితర్ ప్రత్యేక ప్రార్థనలను ప్రజలందరూ ఇళ్ళల్లోనే జరుపుకొ వాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కోరా రు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యం లో కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిందని, లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలెవరూ ప్రత్యేక ప్రార్థనల కోసం బయటకు రావద్దని కోరారు.
నేడు సౌదీలో… రేపు రాష్ట్రంలో రంజాన్
Advertisement
తాజా వార్తలు
Advertisement