రామతీర్థం బోడికొండపై తలపెట్టిన పనులను నిర్ణీత కాలంలో పూర్తి చేసి రాముల వారి ఆలయాన్ని శ్రీరామనవమి నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసు పేర్కొన్నారు. శుక్రవారం విజయనగరం జిల్లాకు వచ్చిన ఆయన స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఆలయ అధికారులతో సమావేశమయ్యారు. బొడికొండపై జరుగుతున్న పనులపై సమీక్షించారు. ఈ క్రమంలో ఆలయ ఈవో ప్రసాద్ సంబంధిత పనుల వివరాలను వెల్లడించారు. అభివృద్ధి పనులను త్వరిగతిన పూర్తి చేసి ఆలయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అన్ని అర్హతలూ ఉన్నట్లయితే ప్రసాదం పథకంలో పెట్టి ఆలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. వచ్చే శ్రీరామనవమి నాటికి ఆలయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, పనుల్లో వేగం పెంచాలని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి, ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
నవమి నాటికి రాములోరి ఆలయం సిద్ధం: మంత్రి వెలంపల్లి ప్రకటన
Advertisement
తాజా వార్తలు
Advertisement