Saturday, January 4, 2025

Indrakiladri | దుర్గ గుడి ఇన్‌చార్జి ఈవోగా రామచంద్రమోహన్..

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇన్‌చార్జి ఈఓగా రామచంద్రమోహన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం ఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న కేఎస్.రామారావు పదవీ విరమణ దృష్ట్యా అదనపు కమిషనర్‌గా ఉన్న రామచంద్రమోహన్‌కు ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు.

బాధ్యతలు స్వీకరించిన రామచంద్ర మోహన్…

ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇన్చార్జి ఈవోగా రామచంద్ర మోహన్ బాధ్యతులను స్వీకరించారు. మంగళవారం సాయంత్రం వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆయన అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం ప్రస్తుత ఈఓ కేఎస్.రామారావు నుండీ బాధ్యతలను స్వీకరించారు.

కాగా, పలు దేవాలయాలకు ఈఓగా బాధ్యతలు నిర్వహించిన రామచంద్రమోహన్.. గతంలో కూడా కనకదుర్గమ్మ ఆలయ ఇన్ చార్జి ఈఓగా బాధ్యతలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement