Wednesday, November 20, 2024

Varma vs Perni Nani: నాని గారి ఎకనామిక్స్ నాకు తెలియదు: వర్మ స్ట్రాంగ్ కౌంటర్

సినిమా టికెట్ల రేట్ల విషయంపై టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఏపీ మంత్రి పేర్ని నానిల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. తన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఏపీ మంత్రి పేర్ని నానిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ”థ్యాంక్యూ నాని గారు..చాలా మంది లీడర్ల లా పరుష పదజాలం తో మాట్లాడకుండా డిగ్నిటీ తో సమాధానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండీ..’’ అని అన్నారు. ఇక విషయానికి వస్తే వంద రూపాయల టికెట్ ని వెయ్యికి అమ్ముకోవచ్చా? అన్నది క్వశ్చన్ కాదండీ ..అది అమ్మేవాడి నమ్మకం..కొనేవాడి అవసరం బట్టి ఉంటుందని చెప్పారు.

నీళ్ళు లేని పరిస్థితి ఉన్నప్పుడు గ్లాస్ నీళ్ళు 5 లక్షలకి కొనచ్చు అది పరిస్థితిని ఎక్స్ప్లాయిట్ అనుకుంటే మార్కెట్ ఉన్నదే దానికి .. కార్ కావాలనే కోరికని ఎక్స్ప్లాయిట్ చెయ్యడానికే లగ్జరీ కార్లు చేసి ఆకర్షిస్తారు తప్పని అడ్డు కట్ట వేస్తే మనం ఇప్పటికీ కాలి నడకన తిరుగుతూ ఉండేవాళ్ళం అని పేర్కొన్నారు.

ముడి పదార్థం 500 కూడా ఖర్చవ్వని పెయింటింగ్ ని కొనేవాడుంటే 5 కోట్లకి అమ్ముతారని అన్నారు. ముడి పదార్థానికి మాత్రమే వాల్యూ ఇస్తే బ్రాండ్ కి, ఐడియా కి ఎలా వెల కడతారు? అని ప్రశ్నించారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కంటిన్యువస్ గా అన్ని ఇంకా బెటర్ గా ఉండేలా ప్రయత్నించడం ..బెటరా కాదా అనేది కొనుగోలుదారుడు నిర్ణయిస్తాడు అని తెలిపారు.

కొనేవాడికి అమ్మేవాడికి మధ్య ట్రాన్సాక్షన్ ఎంతకి జరిగిందనే ట్రాన్స్పరెన్సీ మాత్రమే ప్రభుత్వాలకి అవసరం అని వర్మ పేర్కొన్నారు. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన టాక్స్ కోసం, బ్లాక్ మార్కెటింగ్ అనేది గవర్నమెంట్ కి తెలియకుండా చేసే క్రైమ్ ..ఓపెన్ గా ఎంతకి అమ్ముతున్నాడో చెప్పి అమ్మితే అది తప్పెలా అవుతుంది? అని ప్రశ్నించారు.

ఉదాహరణకి మీకు తెలుసో తెలియదో బాంబే ఢిల్లీ లలో వీక్ డే బట్టి, థియేటర్ బట్టి, ఏ సినిమా అనేదాన్ని బట్టి టికెట్ ప్రైజ్ లు 75 రూపాయల నుండి 2200 రూపాయల వరకూ వేరీ అవుతాయి వీటన్నింటినీ నియంత్రించేది కేవలం ఓల్డెస్ట్ ఎకనామిక్ థియరీ డిమాండ్ అండ్ సప్లై. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది కొన్ని విపరీత పరిస్థితుల్లో బియ్య0 గోధుమ లాంటివి ఉత్పత్తి ఎక్కువయిపోయి ధర పడిపోయినప్పుడు ఉత్పత్తి తక్కువయిపోయి ధర విపరీతంగా పెరిగిపోయినప్పుడు కానీ ఉంటుంది. అలాంటి విపరీత పరిస్థితి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ప్రేక్షకులలో కానీ ఎక్కడ వచ్చిందండీ? అని నిలదీశారు. సారీ నాని గారు లూటీ అనే పదం ఉపయోగించేది బలాన్ని ఉపయోగించి క్రిమినల్ గా లాక్కున్నప్పుడు …అమ్మేవాడు కొనేవాడు పరస్పరం అంగీకరించుకుని చేసుకునే దాన్ని ట్రాన్సాక్షన్ అంటారు అని పేర్కొన్నారు. ఆ ట్రాన్సాక్షన్ లీగల్ గా జరిగినప్పుడు గవర్నమెంట్ వాటా టాక్స్ రూపంగా తానంతట తనే వస్తుందని చెప్పారు.

- Advertisement -

థియేటర్లనేవి ప్రజా కోణంలో వినోద సేవలందించే ప్రాంగణాలు అని చెప్పారు. అలా అని ఏ ప్రజలు చెప్పారో వాళ్ల పేర్లు చెప్పగలరా? లేకపోతే రాజ్యాంగంలో కానీ సినిమాటోగ్రఫీ యాక్ట్ లో ఈ డెఫినిషన్ ఉందా అని ప్రశ్నించారు. మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని సమర్థించుకోవటానికి, ఆ డెఫినిషన్ మీకు మీరు ఇచ్చుకుంటున్నారని విమర్శించారు.

థియేటర్లనేవి , జూన్ 19, 1905న నికెలోడియోన్ అనే ప్రపంచంలోనే మొట్ట మొదటి థియేటర్ అమెరికాలో పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకూ అవి కేవలం బిజినెస్ కోసం పెట్టిన వ్యాపార సంస్థలు..అంతే కానీ ప్రజా సేవ నిమిత్తం ఎప్పుడూ ఎవ్వరూ పెట్టలేదన్నారు. కావాలంటే మీ గవర్నమెంట్ లో ఉన్న థియేటర్ ఓనర్లని అడగండి అని సూచించారు.

సొసైటీ ఆధునీకతకి ముఖ్య కారణం మోటివేషన్..ఎందుకంటే ప్రతి మనిషి కూడా మానవ సహజంగా ఉన్న పొజిషన్ కన్నా ఎదగాలని కోరుకుంటాడు .. పేదవాడు ధనికుడవ్వాలని కోరుకుంటాడు, సైంటిస్ట్ ఎవ్వరూ కనిపెట్టలేనిది కనిపెట్టాలనుకుంటాడు .మీ పార్టీ కార్యకర్త మీలా మంత్రి అవ్వాలని కోరుకుంటాడని వర్మ వ్యాఖ్యానించారు. అలా కోరుకునేది అందరి కన్నా బెటర్ అవ్వాలనే ఒక మోటివేషన్ తో..ఆ బెటర్ గా ఉన్నప్పుడు వచ్చే అదనపు సౌఖ్యాలని కట్ చేసినప్పుడు మనిషికి మోటివేషన్ పోతుంది.. కమ్యూనిజం ఘోరంగా ఫెయిల్ అయ్యింది అక్కడే.. రేట్ లు తగ్గిస్తున్నది పేదవాడికి అందుబాటులో ఉండాలని ఎందుకంటే సినిమాని నిత్యావసర వస్తువుగా పరిగణిస్తున్నాము అని చెప్పింది మీ నాయకులే.. అది కానప్పుడు అసలు ఈ డిస్కషన్ ఎందుకు ఇష్యూ లేనప్పుడు?100% కరెక్ట్. అలాంటప్పుడు V EPIC థియేటర్ లో ఉన్న సౌకర్యాలను చూడకుండా ఆ థియేటర్ ఉన్న ఏరియా బట్టి టికెట్ ప్రైజ్ ఎలా పెట్టారు?ఈ కింది ట్వీట్ లో మీరు చెప్పింది మీకు అర్థమైతే ఇంక సమస్య లేనట్టే.. వివిధ హోటల్సు లో ఆ ఆ హోటల్ వాళ్ళు, వాళ్ళిచ్చే సౌకర్యాలను బట్టే ప్రైజ్ లిస్ట్ పెట్టుకుంటారని మండిపడ్డారు.

నేనడిగే ముఖ్య ప్రశ్న టికెట్ ధర నిర్ణయించటానికి ప్రభుత్వం ఎవరని? పవన్ కళ్యాణ్ సినిమాకి సంపూర్ణేష్ బాబు సినిమాకి మీ ప్రభుత్వం లో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు మీ డ్రైవర్ కి కూడా తేడా లేదా? అని ప్రశ్నించారు. పేదల కోసం చెయ్యడం అనే మీ ఉద్దేశం మంచిది కావచ్చు..కానీ దానికోసం పెదాల్ని ధనికుల్ని చెయ్యటానికి మీ ప్రభుత్వం పని చెయ్యాలి కానీ ఉన్న దనికుల్ని పేదల్ని చెయ్యకూడదని ఎద్దేవా చేశారు. అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో కల్లా పేద రాష్ట్రం అయ్యే ప్రమాదముందని హెచ్చరించారు.

మీ పార్టీలో కొందరు మిగతా లీడర్ల లాగా అడ్డంగా తిట్లతోనో పర్సనల్ విషయాల మీద దూకడం కాకుండా డిగ్నిటీతో సామరస్యం పాటించినందుకు ఇంకోక్కసారి నా ధన్యవాదాలు. ఒక అంగీకారం అనేది లాజిక్ ఇచ్చిపుచ్చుకున్నప్పుడే వస్తుందని వర్మ పేర్కొన్నారు. నేను యావరేజ్ ఇంజినీరింగ్ స్టూడెంట్ని, నాని గారు ఎకనామిక్స్ గురించి నాకు ఏ బీ సీ తెలియదు. కానీ అనుమతిస్తే మీ ప్రభుత్వంలో టాప్ ఎకనామిక్స్ ఎక్స్పర్ట్ తో నేను టీవీ డిబేట్ కి రెడీ అంటూ సవాల్ విసిరారు. మా సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి ఏర్పడ్డ మిసండర్స్టాన్డింగు తొలగిపోవడానికి అవసరం ..థ్యాంక్యూ అంటూ వర్మ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement