సినిమా టిక్కెట్ల వ్యవహారంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విమర్శలు పెంచారు. టికెట్ల అంశంపై నిన్న ఏపీ మంత్రి పేర్నినానితో వర్మ చర్చలు జరిపారు. అయితే తాజా టికెట్ల విషయంపై ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్లు పెట్టారు. కట్టప్పను ఎవరు చంపారు ? అంటూ ఆర్జీవీ చేసిన లేటెస్ట్ ట్వీట్ వైరల్ అవుతోంది.
‘ మహారాష్ట్రలో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ టిక్కెట్ ధర రూ. 2200/-కి అనుమతి ఉంది. కానీ, సొంత రాష్ట్రం ఏపీలో టికెట్లను రూ. 200/-కి విక్రయించడానికి కూడా అనుమతించకపోవడం ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది. “కట్టప్పను ఎవరు చంపారు? ” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రశ్నించే వాళ్ళకి… ఉత్తరాది రాష్ట్రాల్లో ఐనాక్స్ చిహ్న మల్టీప్లెక్స్ చైన్ టిక్కెట్లను రూ. 2200కి విక్రయిస్తోంది. అంటూ మరో వర్మ మరో ట్వీట్ చేశారు.
కాగా, ఏపీలో టికెట్ల ధరలపై ఇటీవల ఆర్జీవీ తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఆయన అడిగిన ప్రశ్నలకు ఏపీ మంత్రి పేర్ని నాని కూడా సమాధానం ఇచ్చి, టికెట్ల ధరల తగ్గింపుపై నేరుగా చర్చించినప్పటికీ వివాదం మాత్రం ముగిసిపోలేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital