సినిమా టికెట్ల ధరల విషయంలో ఏపీ ప్రభుత్వంపై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాటల దాడిని కొనసాగిస్తున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని ఉద్దేశించి వర్మ పలు ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. వైసీపీకి వర్మకు మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. ఈ క్రమంలో సినిమా టికెట్ ధరను నిర్ణయించడానికి ప్రభుత్వం ఎవరని నేరుగా ప్రశ్నించారు రామ్ గోపాల్ వర్మ. పవన్ కళ్యాణ్ సినిమాకి, సంపూర్ణేష్ బాబు సినిమాకి మీ ప్రభుత్వం లో తేడా లేనప్పుడు… మంత్రిగా మీకు, మీ డ్రైవర్ కి కూడా తేడా లేదా? అని ఎద్దేవా చేశారు.
మరోవైపు వర్మ వ్యాఖ్యలపై మరో మంత్రి కొడాలి నాని కూడా స్పందించారు. దీంతో వర్మ స్పందిస్తూ… ‘ఏపీ టికెట్ రేట్ల విషయంలో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని నేచురల్ స్టార్ నాని ఒక్కడే… వాళ్లు చెపుతున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు’ అని ట్వీట్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital