రెండు చుక్కలతో పోలియే రహిత సమాజంగా తీర్చదిద్దొచ్చని కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య పేర్కొన్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా చిన్నారులకు వేయనున్న పోలియో చుక్కలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకీ మేయర్ తో పాటు జాయింట్ కలెక్టర్ మనజిర్ జిలానీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నిండు జీవితాన్ని కేవలం రెండు చుక్కలతో కాపాడుకోవచ్చని అన్నారు. రేపు జిల్లాలో జరిగే పోలియే కేంద్రాల్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement