కర్నూలు స్మార్ట్ : ప్యారిస్ ఒలంపిక్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటి భారతావనికి వన్నె తెస్తారని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ.వెంకటేష్ వాఖ్యానించారు. ఈరోజు ఉదయం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్ బోర్డ్ స్టేడియం ర్యాలీ ప్రారంభ కార్యక్రమంలో టీజీ వెంకటేష్ తో పాటు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బొల్లవరం రామాంజనేయులు తదితరులు పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. దేశ క్రీడా రంగానికి మరిన్ని నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడైతే క్రీడలు, కళలు, వికసిస్తాయో అక్కడే శాంతి సమగ్రత సౌబ్రాతృత్వం ఉంటుందన్నారు. భారత ఒలంపియన్లకు మద్దతుగా క్రీడా సంఘాలు, క్రీడాకారులు, క్రీడా శ్రేయోభిలాషులు ర్యాలీ చేయడం హర్షనీయమన్నారు. స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ స్టేట్ బ్యాంక్ సర్కిల్, చిన్న పార్క్, కోట్ల సర్కిల్, కోర్స్ కళాశాల మీదుగా కొండారెడ్డి బురుజు వరకు సాగిందన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో క్రీడా సంఘ ప్రతినిధులు హర్షవర్ధన్, నాగరత్నమయ్య, వంశీ నవీన్, గుడిపల్లి సురేందర్, జాఫర్ మున్నా, షేక్షావలి, శ్రీనివాసులు, విజయకుమార్, వేణుగోపాల్, ప్రసాద్, ఎం.ఎం.డి భాష, పరుశురాం, ప్రభాకర్, షకీల్, నవి సాహెబ్, జాకీర్, మధు, చిన్న సుంకన్న, ప్రతాప్ లతోపాటు డి ఎస్ ఏ, సాయి సెంటర్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.