Wednesday, November 20, 2024

హైదరాబాద్ లో రైతుల మహా ధర్నా.. హాజరుకానున్న రాకేశ్ టికాయత్

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతు సంఘం నాయకుడు రాకేశ్ టికాయత్ రేపు హైద‌రాబాద్ కు రానున్నారు. ఆల్ ఇండియన్‌‌ కిసాన్‌‌ సంఘర్ష్‌‌ కోఆర్డినేషన్‌‌ కమిటీ (ఏఐకెఎస్‌‌సీసీ) ఆధ్వర్యంలో గురువారం(నవంబర్ 25) హైదరాబాద్‌‌ లోని ఇందిరాపార్క్‌‌ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌‌ చేస్తూ ఢిల్లీ సరిహద్దు చేపట్టిన రైతుల పోరాటం మొదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ ధర్నా నిర్వహిస్తున్నారు.

ఈ ధర్నాకు కిసాన్‌‌ మోర్చా జాతీయ నాయకుడు రాకేశ్‌‌ టికాయత్‌‌ రానున్నారు. సాగు చట్టాల ర‌ద్దు ను పార్లమెంటు ఉబ‌య స‌భ‌ల‌లో ఆమోదించాల‌ని, అలాగే రైతులు పండించే అన్ని పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌త్తు ధ‌ర క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తూ ఈ మ‌హా ధ‌ర్నా జ‌ర‌గ‌నుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement