అమరావతి, ఆంధ్రప్రభ: సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ నెల 28న విజయవాడకు రానున్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించనున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రజనీకాంత్ ఇక్కడికి రానున్నట్లు సమాచారం. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా ఆయనకు ఆహ్వానం పంపింది. శత జయంతి ఉత్సవాలు కావడంతో ప్రతిష్టాత్మకం తీసుకున్న టీడీపీ రజనీకాంత్‌తో పాటు మరికొందరు సినిమా స్టార్లను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 28వ తేదీన పొరంకిలో జరగనున్న కార్యక్రమంలో రజనీకాంత్ పాల్గొననున్నారు. కార్యక్రమం లో రజనీ కాంత్ తో పాటు బాలకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటారు. ఈ ఏడాది అంతా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను నిర్వహించిన టీడీపీ అనేక సమావేశాలను ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వంద రూపాయల నాణేన్ని కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.