గేమ్ ఛేంజర్ హాజరై వెళుతుండగా ప్రమాదం
అయిదు లక్షల సాయం ప్రకటించిన పవన్ కల్యాణ్
నిర్మాత దిల్ రాజు సైతం ఆర్ధిక సాయం అందజేత
బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటన
రాజమండ్రి – రంగంపేట మండలం ఏడీబీ రోడ్డులో కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి బైక్ పై వస్తుండగా వ్యాన్ ఢీకొట్టడంతో మణికంఠ (23), చరణ్ లు మరణించారు. విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వారి కుటుంబానికి సంతాప ప్రకటించారు.. తక్షణసాయం ఒక్కొకరికి అయిదు లక్షలు చొప్పున ఆర్థికసాయం అందజేస్తునట్లు ప్రకటించారు.. అదేవిధంగా చేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్ తరుపున దిల్ రాజు సైతం ఒక్కొక్క కుటుంబానికి అయిదు లక్షలు అందజేయనున్నట్లు తెలిపారు.. అలాగే వారి కుటుంబాలు చిత్ర యూనిట్ అండగా ఉంటుందని ప్రకటించారు.
- Advertisement -