Tuesday, January 7, 2025

Rajahmundry – ఆంధ్ర పేపర్ మిల్లు లాకౌట్ .. ఫ్యాక్ట‌రీ వ‌ద్దే కార్మికుల బైఠాయింపు

జీతాలు పెంపుకోరుతూ కార్మికుల నిర‌స‌న‌లు
అయిదు రోజులుగా కొన‌సాగుతున్న ఆందోళ‌న‌లు
నేటి ఉద‌యం ఆక‌స్మికంగా లాకౌట్ ప్ర‌క‌టించిన యాజ‌మాన్యం
ఆగ్ర‌హించిన కార్మికులు.. ఫ్యాక్ట‌రీ వ‌ద్దే బైఠాయింపు
పోలీసుల రంగ ప్ర‌వేశం…

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం – న‌గ‌రంలోని ఇంటర్నేషనల్ ఆంధ్ర పేపర్ మిల్లు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. జీతాలు పెంచాలంటూ ఐదు రోజులుగా కార్మికులు నిరసన చేస్తుండడంతో కంపెనీ యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఏళ్ల తరబడి జీతాలు పెంచకపోవడంతో నిరసన చేపట్టామని, ఐదు రోజుల నుంచి నిరసన చేస్తుంటే యాజమాన్యం తాజాగా కంపెనీ లాకౌట్ ప్రకటించిందని కార్మికులు మండిపడుతున్నారు. ఆకస్మికంగా లాకౌట్ ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

- Advertisement -

కార్మికుల ఆందోళన విషయం తెలిసి పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో కంపెనీ వద్దకు చేరుకున్నారు. ఆందోళన విరమించాలని కార్మికులకు సూచించారు. అయితే, కార్మికులు మాత్రం వెనక్కి తగ్గడంలేదు. వెంటనే లాకౌట్ ఎత్తివేసి, తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మిల్లు వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement