రాజమండ్రిలోని మధురపూడి ఎయిర్‌పోర్టు కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులు జరుగుతుండగా కొంతభాగం కుప్పకూలింది . ఆ సమయంలో కూలీలు లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.. పిల్లర్లు కుప్పకూలడంతో ఈ ప్రమాదం సంభవించింది.
ఇది ఇలా ఉంటే ఈ ప్రమాదంపై కేంద్ర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి రాజమండ్రి ఎయిర్‌పోర్టు ఘటన విషయం తెలుసుకుని ఎయిర్‌పోర్ట్ అథారిటీ, పౌరవిమానయాన అధికారులతో మాట్లాడారు. ఘటనపై విచారణ జరిపి వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
అంతర్జాతీయ విమానాశ్రయం ..
రాజమండ్రి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించేందుకు 2023లో నాటి కేంద్ర విమానాయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కొత్త టెర్మినల్ భవన పనులకు భూమి పూజ చేశారు. సుమారు రూ. 350 కోట్లతో కొనసాగుతున్న పనులు కొనసాగుతున్నాయి. ఈ ఎయిర్‌పోర్ట్ భవిష్యత్తులో రాత్రివేళ కూడా విమానాల ల్యాండింగ్ అయ్యేలా, టేకాఫ్ తీసుకునేలా విస్తరించడానికి చర్యలను తీసుకుంది కేంద్రప్రభుత్వం. ప్రస్తుతం రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి వారానికి 126 ఫ్లైట్లు రాకపోకలు సాగిస్తున్నాయి. రాజమండ్రి- హైదరాబాద్, రాజమండ్రి- చెన్నై, రాజమండ్రి- బెంగళూరుకు విమానాలు నడుస్తున్నాయి.