Thursday, December 12, 2024

Rajahmahendravaram – జేసీకి చిక్కిన ఇసుక తోడేళ్ళు – 18 బోట్లు స్వాధీనం

ఆంధ్రప్రభ స్మార్ట్, రాజమహేంద్రవరం ప్రతినిధి ) గోదావరి నదిలో ఇసుకను తోడేసి అక్రమంగా తరలిస్తున్న 18 బోట్లను స్వాధీనం చేసుకుని, బోట్స్ మెన్ సొసైటీ సభ్యులపై రెవెన్యూ అధికారులు క్రిమినల్ కేసులను నమోదు చేశారు. ఇసుక అక్రమ రవాణాపై రాష్ర్ట ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్న తరుణంలో.. ఈ ఘటన ఏపీలో సంచలనం సృష్టించింది.

గోదావరి నదిపై రోడ్ కమ్ రైల్ వంతెన సమీపంలో ఇసుకను తోడి పడవల్లో అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో .. తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాయుడు సోమవారం రాజమహేంద్రవరంలో అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రాజమహేంద్రవరం ధోబి ఘాట్ లోని 8 పడవలు, కొవ్వూరు ఏలినమ్మ ఘాట్ లోని 10 బోట్లల్లో అక్రమంగా ఇసుక ను తరలిస్తున్న మొత్తం 18 బోట్లను సీజ్ చేశారు.

రైలు కం రోడ్డు, గ్రామన్ బ్రిడ్జి సమీపంలో ఇసుకను తోడరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ… కొందరు బోట్స్ మెన్ సొసైటీ సభ్యులు తమ ప్రాంతాల్లో ఎక్కువుగా నీరు ఉందని సాకు చూపిస్తూ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుకను రవాణ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

- Advertisement -

ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ చిన్నరాయుడు ప్రత్యక్షంగా తనిఖీలు నిర్వహించారు. బోట్స్ మెన్ సొసైటీ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దీంతో గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుకను తోడేస్తున్న మాఫియా బిక్కచచ్చిపోయింది.

ఇదే రీతిలో నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత ప్రాంతాల్లో ఇసుకను తోడితే కఠిన చర్యలు తప్పవని, క్రిమినల్ కేసులు పెడతామని బోట్ల యజమానులను జాయింట్ కలెక్టర్ చిన్నరాయుడు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement