తీవ్ర ఎండలతో సతమతమవుతున్న ఏపీ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. విదర్భ నుంచి తెలంగాణ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా వానలు పడతాయని, రాయలసీమలో పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించింది. కోస్తాలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే మిగిలిన జిల్లాల్లో ఎండ తీవ్ర కొనసాగుతోంది.
ఇదిఇలా ఉంటే.. సోమవారం కోస్తాలో అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. దీంతో వాతావరణం కొద్దిగా చల్లబడింది. అయితే, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. అనంతపురంలో 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.