Friday, December 6, 2024

Rain Alert | ఏపీ, తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు (శనివారం) వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని… డిసెంబర్ 7 వరకు ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

దీని ప్రభావంతో రెండు, మూడు రోజుల పాటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో ప‌లుచోట్ల‌ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని… తిరుపతి, చిత్తూరు, అన్నమయ జిల్లాల్లోనూ పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతం దాటి డిసెంబర్ 12 నాటికి తమిళనాడు-శ్రీలంక తీరానికి చేరుకుంటుందని అంచనా వేశారు.

తెలంగాణ‌లోనూ….

తెలంగాణలోనూ రానున్న మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతారవణ కేంద్రం అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. అయితే చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement