Tuesday, November 26, 2024

AP | నాలుగు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

ఏపీలో రేపు (సోమవారం) పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలకు తోడు ఆవర్తనం ప్రభావంతో.. ఇవ్వాల (ఆదివారం) పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఇక‌ సోమవారం కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల దృష్ట్యా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రొణమకి కూర్మనాథ్‌ సూచించారు.

ఆవర్తనం ప్రభావంతో ఆది, సోమవారాల్లో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement