అనంతపురం జిల్లా పామిడి మండలంలోని పత్తి రైతులకు అకాల వర్షాలు తీరని నష్టాన్ని తెచ్చాయి. చేతికందే దశలో పత్తి పట్ట మొత్తం నీళ్లపాలయ్యింది. రైతులు పత్తి ఓడుపుకునే సమయానికి అకాల వర్షాలు కురవడంతో పొలాల్లోనే చెట్ల పై పత్తికి మొలకలెత్తి తీరని నష్టాన్ని మిగిల్చింది. ఎకరాకు 25వేల నుంచి 30 వేల దాకా పెట్టుబడి పెట్టడానికి బ్యాంకుల ద్వారా అనేక చోట్ల వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడిగా పెట్టారు.
ఇప్పుడు జరిగిన ఈ నష్టానికి పత్తి పంట చేతికి రాకపోవడంతో రైతులు చేసిన అప్పులు తీర్చలేక అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉంది… రైతులు ఆత్మహత్యలకు పాల్పడకముందే సంబంధిత అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతుల సమస్యలను.. బాధలను తెలియజేయాలి. జరిగిన నష్టానికి పరిహారాన్ని అందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని అనంతపురం జిల్లా రైతులు కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..