రెండు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని అల్పపీడనం ఏర్పడిందని చెబుతున్నారు. రానున్న ఇరవై నాలుగు గంటలలో ఇది వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు పడే అవకాశముందని చెప్పింది.
- Advertisement -
ఇవాళ ఉదయం నుంచే నలభై నుంచి యాభై కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. సముద్రం కూడా అల్లకల్లోలంగా మారే అవకాశమందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని తెలిపింది. ఇప్పటికే తమిళనాడు అంతటా కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.