Sunday, November 17, 2024

వ‌చ్చే మూడు రోజుల‌లో తెలుగు రాష్ట్రాల‌లో వ‌ర్షం కుమ్ముడే..

తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టికే రెండు రోజులుగా వ‌ర్షాలు కురుస్తుంటే ఈ వాన‌లు మ‌రో మూడు రోజులు కంటిన్యూ అవుతాయ‌ని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు తెలంగాణలో, అటు ఎపిలో కూడా ఒక్క‌సారిగా వాతావరణం మారింది. ఎండ‌లు మంట‌లు త‌గ్గి వాతావ‌ర‌ణం చ‌ల్ల బ‌డింది.
ఇక‌ వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గ‌త సాయంత్రం నుంచి హైదరాబాద్ సహా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. హైద‌రాబాద్ లో రెండు గంట‌ల పాటు వీర కుమ్ముడు కుమ్మిన వ‌ర్షంతో జ‌న‌జీవ‌నం అత‌లాకుత‌ల‌మైంది.. ఈ వ‌ర్షాలు మ‌రో మూడు రోజులు సాగే అవ‌కాశాలున్నాయి..


ఇక మరోవైపు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. విదర్భ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి మరట్వాడ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి వ్యాపించిందని తెలిపారు. మరోవైపు రాయలసీమలో ముఖ్యంగా నంద్యాల, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద ఉండవద్దని సూచించారు. రైతులు, కూలీలు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనకాపల్లి, శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. చెట్ల కింద ఉండొద్దు.. దయచేసి అప్రమత్తంగా ఉండండి అంటు అధికారులు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఇక ఉత్తర కోస్తా, యానాంలో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని చెప్పారు. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement