Sunday, November 3, 2024

Rain Season – నేటి నుంచి వర్షాకాలం ప్రారంభం

మరో 24 గంటల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు రానున్నట్టు భారత వాతావరణశాఖ బుధవారం వెల్లడించింది. రుతుపవనాలు ముందే వస్తున్నా కేరళ ఇప్పటికే భారీ వర్షాలు, తాగునీటి ఎద్దడితో అల్లాడిపోతుంది. కొట్టాయం, ఎర్నాకులం జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌, మరో మూడు జిల్లాల్లో ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. కర్ణాటక, ఏపీ, అస్సాంలోని కొన్ని ప్రాంతాలకు జూన్‌ 5 నాటికి, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ ఎగువభాగం, పశ్చిమబెంగాల్‌కు జూన్‌ 10న చేరుకుంటాయని ఐఎండీ తెలిపింది.

నేటి నుంచి వర్షాకాలం ప్రారంభమైనట్టేనని పేర్కొన్నది. రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో పొడివాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. రాగల రెండు రోజులు పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement