Friday, November 22, 2024

Rain తిరుమలలో కుమ్మేసిన వర్షం… భక్తులకు ఉష్ణతాపం నుంచి ఉపశమనం

తిరుమల – ఎపిలో ఎండలు మండిపోతున్నాయి. ఎక్కడి చూసినా దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతతో జనాలను ఠారెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఎంతో మంది వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువై ఉండే తిరుమలలో భారీ వర్షం కురిసింది. భారీ ఎండలతో కొన్ని రోజులుగా అల్లాడిపోతున్న భక్తులు ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. ఉదయం నుంచి కూడా తిరుమలలో వాతావరణం కొంత చల్లగానే ఉంది. మధ్యాహ్న సమయానికి వాతావరణం పూర్తిగా మారిపోయి అరగంట సేపు జోరు వాన కురిసింది. ఈ వర్షంతో తిరుమల చల్లగా మారిపోయింది. మరోవైపు, కొండపై భారీ వర్షం కురిసినప్పటికీ… కింద తిరుపతిలో వర్షం లేకపోవడం గమనార్హం. 

Advertisement

తాజా వార్తలు

Advertisement