ఆంధ్రప్రదేశ్ కి మరో ముప్పు ఏర్పడింది. రాష్ట్రాన్ని వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది బుధవారం నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి అల్పపీడనంగా మారనుంది. నైరుతి బంగాళాఖాతం మధ్య ప్రాంతాలపైన ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 1.5కి.మీ. ఎత్తు వరకు ద్రోణి విస్తరించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి 26న తమిళనాడు, శ్రీలంక ప్రాంతాల్లోనే తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రభావంతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ నెల 26, 27న నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..