పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే, ఇప్పుడు మరో గండం వచ్చింది. ఈ నెల 13న అండమాన్ తీరప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించారు. నవంబరు 17 తేదీనాటికి ఇది మరింత బలపడి కోస్తాంధ్ర వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
మరోవైపు ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవాళ, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏపీలోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
ఇది కూడా చదవండి: Heavy Rains: ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily