ఏపీలో మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడు, రాయలసీమ, తెలంగాణ మీదుగా దక్షిణ శ్రీలంక నుంచి ఈశాన్య మధ్యప్రదేశ్ వరకు ద్రోణి కొనసాగుతుండడమే ఇందుకు కారణం. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఈ ద్రోణి ప్రభావంతో నిన్న అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణం, ఏలూరు, కాకినాడ తదితర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. అలాగే, నేటి నుంచి శుక్రవారం వరకు అంటే మరో మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని, వర్షం పడే సమయంలో బయటకు వెళ్లవద్దని హెచ్చరించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement