ఏపీలో ఇటీవల కురిసిన వర్షాలకు రాయలసీమ జిల్లాలను వణించించాయి. చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీకి మరో పిడుగులాంటి వార్త చెప్పింది వాతావరణ శాఖ. రాయలసీమ, దక్షిణ కొస్తాకు మరో వాన గండం ఉందని తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలలో తక్కువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో సర్క్యులేషన్ ఉన్నట్లు పేర్కొంది. రాబోయే 4-5 రోజులలో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని చెప్పింది. దీని ప్రభావంతో 26 నవంబర్ – 2 డిసెంబర్ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో చురుగ్గా కదలనున్న రుతుపవనాల కారణంగా.. రాయలసీమ, దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నెల్లూరు, ప్రకాశం చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం విశాఖలోని వాతావరణ శాఖ చెప్పింది.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..