బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ నెల 29న అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇది క్రమంగా బలపడి కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతాలు వణికిపోయాయి. తాజాగా మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..