ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు ఉప్పొంగడంతో చాలా వరకు పంటనష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. అయితే అప్పుడే అయిపోలేదన్నట్లుగా మరో రెండ్రోజుల పాటు తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. దాంతో తీవ్ర ఆస్తి పంట, ప్రాణనష్టం వాటిల్లింది. ఇదిలా ఉండగానే మళ్లీ అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.
ఈరోజు, రేపు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరకోస్తాంధ్ర ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపగా, రాయలసీమలో సైతం ఒకటి రెండు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..