ప్రయాణీకులకు రైల్వేశాఖ షాకిచ్చింది. విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాలకు నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
ఫిబ్రవరి 7 నుంచి మార్చి 27 వరకు విశాఖపట్నం-సికింద్రాబాద్ (08579), ఫిబ్రవరి 8 నుంచి మార్చి 28 వరకు సికింద్రాబాద్-విశాఖపట్నం (08580), ఫిబ్ర వరి 5 నుంచి మార్చి 25 వరకు విశాఖపట్నం-తిరుపతి (08583), ఫిబ్రవరి 6 నుంచి మార్చి 26 వరకు తిరుపతి-విశాఖపట్నం (08584), ఫిబ్రవరి 4 నుంచి మార్చి 31 వరకు విశాఖపట్నం-బెంగళూరు (08543) ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 1 వరకు బెంగళూరు-విశాఖపట్నం (08544), ఫిబ్రవరి 3 నుంచి మార్చి 30 వరకు భువనేశ్వర్-తిరుపతి (02809), ఫిబ్రవరి 4 నుంచి మార్చి 31 వరకు తిరుపతి-భువనేశ్వర్ (02810), ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 29 వరకు పాట్నా-సికింద్రాబాద్ (03253), ఫిబ్రవరి 7 నుంచి మే 1 వరకు హైదరాబాద్-పాట్నా (07255), ఫిబ్రవరి 9 నుంచి ఏప్రిల్ 26 వరకు సికింద్రాబాద్-పాట్నా (07256), ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 25 వరకు ధనాపూర్-సికింద్రాబాద్ (03225), ఫిబ్రవరి 4 నుంచి ఏప్రిల్ 28 వరకు సికింద్రాబాద్-ధనాపూర్ (03226), ఫిబ్రవరి 7 నుంచి ఏప్రిల్ 28 వరకు బెంగళూరు-ధనాపూర్ (03242) రైళ్లను పొడిగించినట్లు అధికారులు తెలిపారు.
విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): సౌత్ ఈస్ట్రన్ రైల్వేలోని పలు సెక్షన్‌లలో జరుగుతున్న నిర్వహణ పనుల కారణంగా విజయవాడ డివిజన్ మీదుగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 2న నర్సాపూర్-హుబ్లీ (17225), ఫిబ్రవరి 3న హుబ్లీ-నర్సాపూర్ (17226), హుబ్లీ-గుంతకల్లు (07337), గుంతకల్లు-హుబ్లీ (07338), బల్గెవి-కాజీపేట (07335), ఫిబ్రవరి 4న కాజీపేట-బల్గెవి (07336) రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.