ఏపీకి తర్వలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రానున్నారని ఆపార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ తెలిపారు. అమరావతి, విశాఖ ఉక్కు పోరాటానికి మద్దతుగా రాహుల్ పర్యటన చేయనున్నారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ కొరత ఉందన్న చింతా మోహన్.. సిద్దాంతపరంగా బలంగా ఉన్నప్పటికీ ప్రజా ఆమోదయోగ్యమైన నాయకత్వం లేదన్నారు. త్వరలో పీసీసీలో మార్పులు ఉంటాయని చెప్పారు. తాను పీసీసీ అధ్యక్షుడిల రేస్ లో లేనని స్పష్టం చేశారు. మూడు రాజధానులు తొందరపాటు నిర్ణయమన్న చింతా మోహన్…అఖిలపక్ష సమావేశం తర్వాత అందరి అభిప్రాయం తీసుకుని ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అని స్పష్ట చేశారు.
ఇది కూడా చదవండి: India Corona: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు