Thursday, November 21, 2024

జ‌గ‌న‌న్న గోరుముద్ద‌లో రాగిజావ‌..

మార్చి 2 నుండి అమలు
శ్రీ సత్యసాయి చారిటబుల్‌ ట్రస్ట్‌తో ఎంవోయూ
పిల్లలకు ఐరన్‌, కాల్షియం లోపాలు లేకుండా నివారించడమే లక్ష్యం

అమరావతి, ఆంధ్రప్రభ: జగనన్న గోరుముద్ద మెనూలో రాగిజావ చేరింది. మార్చి 2వ తేదీ నుంచి శ్రీ సత్యసాయి ఛారిటబుల్‌ ట్రస్టు సహకారంతో విద్యార్థులకు అందిం చనున్నారు. ఈమేరకు గురువారం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షం లో ఎంఓయూ చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జగనన్న గోరుముద్ద పథకం ద్వారా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44,392 స్కూళ్లలో 37,63,698 విద్యార్ధులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. రోజు వారీ అందిస్తున్న మెనూతో పాటు- పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడా నికి వారంలో 5 రోజులు గుడ్డు, మూడు రోజులు బెల్లం, పల్లీ చిక్కీ ఇవ్వాలని నిర్ధేశించామని బెల్లం, పల్లీ చిక్కీ ఇవ్వని రోజుల్లో పిల్లలకు తగినంత ఐరన్‌, కాల్షియం అందిం చేందుకు వీలుగా చిరుధాన్యాలను మధ్యాహ్న భోజన పథకంలో భాగం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అందులో భాగంగానే జగనన్న గోరుముద్దలో రాగిజావ అందించేందుకు నిర్ణయం తీసుకు న్నట్లు చెప్పారు. రాగిజావను అద నంగా చేర్చడం ద్వారా మరింత పౌష్టిహాకారం పిల్లలకు అందుతుందన్నారు. కేవలం గోరుముద్ద కార్యక్రమానికే రూ.1700 కోట్లు- ఖర్చు పెడుతున్నట్లు చెప్పారు.

ఖర్చు మూడు రెట్లు పెరిగింది
టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.600 కోట్లు- మాత్రమే మధ్యాహ్న భోజన పథకానికి ఖర్చు పెడితే వైసీపీ హయాంలో ఆ ఖర్చు మూడు రెట్లు పెరిగిందని సీఎం చెప్పారు. విద్యారంగంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. అమ్మఒడి దగ్గర నుంచి నాడు- నేడు వరకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామన్నారు. 6వతరగతి నుంచి ఆ పై తరగతుల్లో ప్రతి తరగతి గదిలో డిజిటిల్‌ స్కీన్ర్‌ ఐఎఫ్‌పి ఏర్పాటు- చేస్తున్నామన్నారు. 30,230 తరగతి గదుల్లో ఈ ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానెల్స్‌(ఐఎఫ్‌పి)లను ఏర్పాటు- చేస్తున్నామని నాడు-నేడు తొలిదశ పూర్తి చేసుకున్న సుమారు 15వేల స్కూళ్లలో ఈ జూన్‌ నాటికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నట్లు చెప్పారు. నాడు -నేడులో ఆఖరు కాంపొనెంట్‌ 6వతరగతి ఆపై తరగతులను డిజిటలైజ్‌ చేసే కార్యక్రమం చేపట్టామని, అంతకంటే దిగువ తరగతుల వారికి స్మార్ట్‌ టీ-వీలు ఏర్పాటు- చెెస్తున్నట్లు చెప్పారు. వీటితో పాటు- పిల్లలకు విద్యాకానుక, గోరుముద్ద, ఇంగ్లిషు మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌, బైలింగువల్‌ -టె-క్ట్స్‌బుక్స్‌, 3వ తరగతి నుంచి సబ్జెక్ట్‌ టీ-చర్ల కాన్సెప్ట్‌, 8వతరగతి పిల్లలకు ట్యాబులు పంపిణీ వంటి అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపడతున్నామని సీఎం జగన్‌ వివరించారు. పిల్లల కరిక్యులమ్‌ను బైజూస్‌ కం-టె-ంట్‌తో అనుసంధానం చేస్తూ విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పిల్లల కోసం విద్యాదీవెన- 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రూ.20 వేల వరకు వసతి దీవెనను అమలు చేస్తున్నామని సీఎం వివరించారు. విదేశీ విద్యా దీవెనను కూడా అమలు చేస్తున్నామని ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ -50 కాలేజీలలో, 21 రకాల విభాగాలు, లేదా కోర్సులకు సంబంధించి సీట్లు- సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.1.25 కోట్ల వరకు ఈ పథకం కింద ప్రభుత్వం అందిస్తోందన్నారు. మిగిలిన వారికి రూ.1 కోటి వరకు అందజేస్తున్నామని చెప్పారు. శుక్రవారం కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ఈ పథకంలో అర్హత పొందాలంటే కనీసం పదోతరగతి పాస్‌ కావాలనే నిబందన విధించినట్లు చెప్పారు. ఇవన్నీ విద్యాంగంలో గొప్ప మార్పులు తీసుకొచ్చే అడుగులు అన్నారు. గోరుముద్ద మెనూలో రాగిజావను అమలు చేసే ప్రయత్నంలో సత్యసాయి ట్రస్టు భాగస్వామ్యం కావడం మంచి పరిణామం అన్నారు.

మార్చి 2 నుంచి అమల్లోకి
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మార్చి 2 వ తేదీ నుంచి రాగిజావను జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా అందించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. దీనికి రూ.86 కోట్లు- ఖర్చవుతుందన్నారు. ప్రభుత్వంతో పాటు- స్వచ్ఛంద సంస్ధలను భాగస్వామ్యం చేయాలన్న ఆలోచనతో సత్యసాయి ట్రస్టును ఇందులో భాగస్వామ్యం చేసినట్లు చెప్పారు. విద్యార్థులకు అందించే జావకు అవసరమైన రాగి పిండి, బెల్లం పిండి సత్యసాయి ట్రస్టు సరఫరా చేస్తుందని ఇందుకు సుమారు సుమారు రూ.42 కోట్లు- ఖర్చు అవుతోందన్నారు. మూడు సంవత్సరాల పాటు- సత్యసాయి చారిటబుల్‌ ట్రస్ట్‌ సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. శ్రీ సత్యసాయి మేనేజింగ్‌ ట్రస్టీ రత్నాకర్‌ మాట్లాడుతూ బాబా స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్‌న చేపట్టామన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యారంగాంలో చేస్తున్న కృషి కచ్చితంగా విద్యకు పునరుజ్జీవనం తీసుకొస్తుందన్నారు. సీఎం జగన్‌ చెప్పిన ప్రతి మాట అమలు చేసి చూపిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్‌, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సీ ఎన్‌ దీవాన్‌రెడ్డి, మిడ్‌ డే మీల్స్‌ డైరెక్టర్‌ నిధి మీనా, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్‌ పి బసంత్‌ కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement