అమరావతి,ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని 37,63,698 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తూ ఏటా రూ. 86 కోట్ల అదనపు వ్యయంతో రాగిజావ అందించే కార్యక్రమాన్ని మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయం నుండి సిఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఏటా సగటు-న రూ. 450 కోట్లయితే దాదాపు 4 రెట్లు- అధికంగా జగనన్న గోరుముద్ద క్రింద ఏడాదికి రూ. 1,824 కోట్లు ఖర్చు చేస్తోంది. రాగిజావకు ఏటా మరో రూ. 86 కోట్లతో మొత్తం రూ.1,910 కోట్ల వ్యయం చేస్తోంది.
మధ్యాహ్న భోజన పథకంలో ఇప్పటికే సమూల మార్పులు చేసి జగనన్న గోరుముద్ద ద్వారా ప్రతి రోజూ మెనూ మార్చి బలవర్ధకమైన, మెరుగైన, రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారం వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తోంది. ఐరన్, కాల్షియం వంటి పోషకాలు అందించి విద్యార్ధుల్లో రక్తహీనత, పోషకాల లోపాన్ని నివారించేందుకు వారానికి మూడు రోజులు (మంగళ, గురు, శని) బెల్లంతో కూడిన రాగిజావను విద్యార్ధులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందించనుంది. ఇక మిగిలిన 3 రోజులు గోరుముద్దలో అందించే చిక్కీ ఎలాగూ ఉండనే ఉంది.జగనన్న గోరుముద్దలో భాగంగా ఇప్పటికే వారానికి 15 వెరైటీ-లు, ఐదు రోజుల పాటు- గుడ్డు, 3 రోజులు చిక్కీ, ఇకపై 3 రోజులు రాగిజావ కూడా ఇవ్వనున్నారు.