ఏపీలో వినాయకచవితిపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్రంగా స్పందించారు. యేసుకు లేని కరోనా గణేశ్‌కు ఏందుకని ఆయన ప్రశ్నించారు. చర్చిల్లో ప్రార్థనలకు అనుమతించారన్న రఘురామ.. అక్కడ కరోనా రాదా అని నిలదీశారు. గణేశుడు ఆదిదేవుడని ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులందరూ ఆరాధించే విఘ్నేశ్వరుని పూజలకు అడ్డంకులు ఏందుకని ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. విగ్రహాలు ధ్వంసం చేసిన వాళ్ళను పట్టుకోలేక పోయిన వారు.. విగ్రహాలు అమ్మనియకుండ చేస్తారా? అని హిందువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని రఘురామ చెప్పారు. వైఎస్ జయంతి, వర్ధంతి, మొహర్రం అప్పుడు లేని కరోనా.. ఇప్పుడు వినాయక చవితికి ఎలా వచ్చిందన్నారు. సీఎం బెట్టు వీడి అన్ని మతాల వారిని ఒకేలా చూడాలని సూచించారు. నిబంధనలు పెట్టి పండుగలు చేసుకునేందుకు అనుమతించాలన్నారు.
ఇది కూడా చదవండి: కేంద్రం ఇచ్చిన కోవిడ్ గైడ్ లైన్స్ మార్చగలరా?: సోముకు వెల్లంపల్లి ప్రశ్న