ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించడం తెలిసిందే. రఘురామకృష్ణరాజుకు రిమాండ్ ఖైదీ నెంబరు 3468 కేటాయించారు. ఆయనను జైల్లోని పాత బిల్డింగ్ మొదటి సెల్ లో ఉంచారు. కాగా, రఘురామకృష్ణరాజుపై తమకు ఎలాంటి కక్షసాధింపు లేదని ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు స్పష్టం చేశారు. రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. రఘురామకృష్ణరాజుకు చిత్తశుద్ధి ఉంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబే రఘురామకృష్ణరాజు వెనుక ఉండి ప్రభుత్వం, సీఎం జగన్ పై కుట్రలకు పాల్పడ్డారని శ్రీనివాసులు ఆరోపించారు.
గుంటూరు జైల్లో రఘురామరాజుకు పాత భవనంలోని మొదటి సెల్ కేటాయింపు
Advertisement
తాజా వార్తలు
Advertisement