Tuesday, November 26, 2024

సర్పంచ్లకు చెక్ పవర్ పై స్పష్టత లేదు: జగన్ కు రఘురామ లేఖ

ఆంధ్రప్రదేశ్ సీఎ జగన్‌కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. తాజాగా నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో ఆయన మరో లేఖ రాశారు. ఇందులో సర్పంచ్ల అధికారాల్లో కోత విధించడం ప్రజాస్వామ్యానికి చేటు అని పేర్కొన్నారు. సర్పంచ్లకు చెక్ పవర్‌పై స్పష్టత లేదని, దీంతో బ్యాంకుల నుంచి నిధులు తీసుకోలేక నిస్సహాయంగా మారారని తెలిపారు. అలాగే, గ్రామ సభ క్రియాశీలత్వం కోల్పోయి లాంఛనప్రాయంగా మారిందని చెప్పారు. నిధులు లేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీలను వైసీపీ సర్కారే బలహీన పరుస్తోందనే భావన ప్రజల్లో ఉందని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం పోతోందని చెప్పారు. చివరకు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. వారిలో ఉన్న అసంతృప్తిని ఏదో ఒక రోజున  బయట పెడతారని తెలిపారు. సర్పంచ్లకు ఉండాల్సిన అన్ని అధికారాలు ఇస్తూ నిర్ణయం తీసుకోవాలని రఘురామ డిమాండ్ చేశారు.  తక్షణమే బేషరతుగా జీవోను ఉపసంహరించుకోవాలని, సర్పంచ్ లకు, గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వారికి రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం బాధ్యతలు అప్పగించాలన్నారు. తద్వారా క్షేత్ర స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని నేను డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: జగనన్న ఇళ్లు కొత్త జంటల శోభనానికి పనికిరావు: వైసీపీ ఎమ్మెల్యే

Advertisement

తాజా వార్తలు

Advertisement