ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. తాజాగా నవ సూచనలు పేరుతో జగన్‌కు రఘురామ ఏడో లేఖ రాశారు. నిరాటంకంగా ఇసుక సరఫరాపై లేఖలో ప్రస్తావించారు. ఇసుక సరఫరా బాధ్యత కాంట్రాక్టర్‌కు అప్పగించాకే కొరత తీవ్రమైందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పడిపోయాయన్నారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన రెండో ఇసుక పాలసీ కూడా దారుణంగా విఫలమైందని విమర్శించారు. మూడో ఇసుక పాలసీ కోసం పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారని అన్నారు. హామీకి భిన్నంగా ఇసుక ర్యాంపుల దగ్గర దళారీల ప్రమేయం ఉందని ఆరోపించారు. అన్ని చోట్ల ఒకే ధరకు ఇసుక హామీ అమలు కావడం లేదన్నారు. వెంటనే ఇసుక పాలసీని మార్చాలని లేఖలో రఘురామ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: బ్రిటన్ అన్ లాక్.. మాస్కులు ధరించడం ఇక ప్రజల ఇష్టం!