సీఐడీ పోలీసులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పేర్కొంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనపై దాడి చేశారనే అంశంపై విచారణ జరపాలని పిటిషన్ వేశారు. సీఐడీ పోలీసులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని రఘురామ పిటిషన్లో వివరించారు. ఇప్పటికే ఈ విషయమై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్న రఘురామ న్యాయవాది… హైకోర్టు నుంచి తదుపరి ఆదేశాలు అవసరం లేదని చెప్పారు. సీఐడీ పోలీసుల దాడి అంశంపై పిటిషన్ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్న పిటిషన్పై విచారణ జరుపుతామని తెలిపింది.
ఇదీ చదవండి: ఏపీలో త్వరలోనే కేబినెట్ విస్తరణ.. తెరపైకి కొత్త మంత్రుల పేర్లు