Saturday, September 21, 2024

AP | వైభవంగా ప్రారంభమైన రాఘవేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు

మంత్రాలయం, (ప్రభ న్యూస్) : దక్షిణ భారతదేశంలో రెండవ తిరుపతిగా పేరుగాంచిన మంత్రాలయం ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ఆరాధన మహోత్సవాలు (ఆదివారం) అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన పవిత్ర తుంగభద్ర నది తీరంలో వెలసిన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 353వ సప్తరాత్రోత్సవాలు వైభావంగా ప్రారంభం అయ్యాయి.

బృందావన రూపంలో వెలసిన మహిమలు చూపించే శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శించుకోవడానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి భారీగా భక్తులు తరలిరానున్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామికి తిరుమల తిరుపతి దేవస్థానాల‌ తరపున ఈవో శ్యామలరావు పట్టవస్రాలు శ్రీ మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులకు అందజేశారు. ఆయనకు మఠం అధికారుల ఘన స్వాగతం పలికారు. అనంతరం ఈవో శ్యామలరావుకు పీఠాధిపతి సన్మానించారు. శ్రీ మఠం పీఠాధిపితి శ్రీ సుభుదేంద్రతీర్థులు ఆధ్వర్యంలో ధ్వజారోహణ గావించి సప్తరాథోత్సవాలు ప్రారంభించారు.

పూజ్యులైన సుప్రభాత సేవ, నిర్మల, విసర్జన సేవ, ఉత్సవ రాయరాపాదపూజ మూలరాములకు పూజ అలంకార సమర్పణ అష్టోదకం మహా మంగళహారతి నిర్వహించి పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు ప్రసాదాలు అందించారు. అనంతరం భక్తులకు ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ముందు భాగంలో ప్రత్యేకంగా లైటింగ్ అలంకరించారు. అలాగే భక్తులను అలంకరించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.

ఈకార్యక్రమంలో, ఏఏఓ మాదవ శెట్టి, మేనేజర్లు వెంకటేష్ జోషి, ఎస్.కె శ్రీనివాసరావు, వ్యాసరాజ్ఆచార్, ఐపి నరసింహమూర్తి, శ్రీపతి ఆచర్, రవి కులకర్ణి, విజయేంద్రాఆచార్, సుజేంద్ర, చార్, ఏఏ సురేష్ కోనాపూర్, బద్రీనాథ్. భీమసేన్రావు, బిందు స్వామి, సీఐ రామాంజినేయులు, ఎస్ ఐ గోపినాథ్, తదితరులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు తిలకించడానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల నుంచి అనేక వేల మంది భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement