Friday, November 22, 2024

AP | ఏప్రిల్‌ 15 నుంచి రబీ ధాన్యం సేకరణ.. వ్యవసాయ, ఉద్యానశాఖ సమీక్షలో సీఎం జగన్‌

అమరావతి, ఆంధ్రప్రభ: రబీ సీజన్‌ లో పండించిన ధాన్యాన్ని వచ్చే నెల 15 నుంచి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ అనుబంధ శాఖలపై బుధవారం సచివాలయంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రబీ సీజన్‌ ధాన్యం సేకరణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఇటీ-వల అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టపరిహారం నివేదిక వీలైనంత తొందరగా ప్రభుత్వానికి అందించాలని సీఎం ఆదేశించారు.

ఎన్యుమరేషన్‌ ప్రక్ర్రియ కొనసాగుతుందనీ, ఏప్రిల్‌ మొదటి వారంలో పంట నష్టం నివేదిక, రెండవ వారంలో నష్టపోయిన రైతుల వివరాలతో జాబితా విడుదల చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. రబీ ధాన్యం సేకరణకు సాంకేతికంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా 100 శాతం ఈ-క్రాపింగ్‌ పూర్తి చేశామని అధికారులు సీఎంకు వివరణ ఇచ్చారు. కల్తీ ఎరువులు, కల్తీ పురుగుమందులు లేకుండా చూడాలి.. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు అందించేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలి..ఈ పొరపాట్ల కారణంగా రైతులు నష్టపోకూడదని అధికారులకు సీఎం సూచించారు.

దీనిపై అధికారులు వివరణ ఇస్తూ ఆర్బీకేల ద్వారానే నాణ్యమైన ఎరువులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది 2023-24లో ఆర్బీకేల ద్వారా 10.5లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు- వెల్లడించారు. ఎరువులతో పాటు- ఏపీ ఆగ్రోస్‌ ద్వారా రైతులకు అవసరమైన స్థాయిలో పురుగుమందుల పంపిణీకి కూడా చర్యలు చేపట్టినట్టు- తెలిపారు. దీని వల్ల నకిలీ, నాణ్యతలేని పురుగుమందులను పూర్తిస్థాయిలో నివారణ చేసేందుకు అవకాశం ఉంటు-ందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement